Mahabilvarchana | మారుతీనగర్, ఆగస్టు 18 : మెట్పల్లి పట్టణంలోని ఓం కారేశ్వాలయం, విఠలేశ్వరాలయం, ఆరపేట శివాలయాల్లో సోమవారం మహా బిల్వార్చన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆది మహా శివునికి ప్రీతిపాత్రమైన బిల్వార్చన కార్యక్రమాలను ఆయా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు చేపట్టారు. శ్రావణమాసం ఆఖరి సోమవారం సందర్భంగా శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది.
భక్తులు స్వామి వారిని దర్శించుకొని పంచామృతాభిషేకాలతో పాటు తదితర ప్రత్యేక పూజలను చేశారు. అదే విధంగా అయ్యప్ప ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాబిల్వార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కాగా ఆలయాల్లో భక్తులు ప్రజాప్రతినిధులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు.