Veenavanka | వీణవంక శివాలయంలో లడ్డులతో మహాభిషేకం
వీణవంక మండల కేంద్రంలోని అతిపురాతన శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వామి వారికి లడ్డులతో మహాభిషేక కార్యక్రమాన్ని ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు.
Veenavanka | వీణవంక, ఫిబ్రవరి 8 : వీణవంక మండల కేంద్రంలోని అతిపురాతన శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వామి వారికి లడ్డులతో మహాభిషేక కార్యక్రమాన్ని ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. అర్చకులు సుబ్రమణ్యంశర్మ మంత్రాల మధ్య స్వామి వారికి అభిషేకాన్ని చేయగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ రామిడి శ్రీనివాస్, ఉపసర్పంచ్ తాళ్లపెల్లి మహేశ్ గౌడ్, సభ్యులు మహాశివరాత్రి కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 15, 16 తేదీలలో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన వీణవంక శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆలయకమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దీవెనలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి, వనిత క్లబ్ సభ్యులు అల్లెంకి సాంబమూర్తి, రమేష్, నాగన్న, విశ్వంభర్, లక్ష్మయ్య, స్థానికులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రెండో ట్రైలర్ దసరాకేనా.. అక్టోబర్ 20న మరో భారీ అప్డేట్!
Ram Charan | రామ్ చరణ్ – అనిరుధ్ కాంబినేషన్ ఫిక్స్.. క్రేజీ కాంబోపై భారీ అంచనాలు!
Shreyas Iyer | శ్రేయస్ అయ్యర్ ఔట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని .. వైరల్‌గా మారిన వీడియో
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

