Peddapally | పెద్దపల్లి టౌన్, జూన్ 27 : మాదిగ సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు మంత్రులకు ఆరుగురు ఎమ్మెల్యేలకు కరీంనగర్ జిల్లా అలుగునూర్ ఏఎంఆర్ కన్వెన్షన్ హాల్లో జూన్ 29న మాదిగ మాదిగల ఆత్మీయ సన్మానం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య తెలిపారు.
పెద్దపెల్లి ప్రెస్ క్లబ్లో మాదిగల ఆత్మీయ సన్మానం, వాల్పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గం నుండి గెలిచిన ఇద్దరు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని పార్టీలకు అతీతంగా మేధావులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని ఘనంగా సన్మాన కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు.
జాతి ఐక్యత కోసం ప్రతీఒక్కరూ ఇదే ఆహ్వానంగా భావించి తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొంకూరు కైలాసం, ఈర్ల సురేందర్, అసంపల్లి నాగరాజు, బచ్చలి రాజయ్య, తాండ్ర సదానందం తదితరులు పాల్గొన్నారు.