Madeleswara Swamy | ఓదెల, జూన్ 25 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో రజక కులస్తులు తమ కుల దైవమైన మడేలేశ్వర స్వామి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతీ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన మొదట్లో మడేలేశ్వర స్వామికి రజక కులస్తులు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. గ్రామం నుంచి డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో మడేలేశ్వర స్వామి దేవాలయం వరకు ఊరేగింపుగా తరలి వెళ్లారు. మొదటగా గ్రామంలోని గ్రామదేవతలకు పూజలు చేసి, ఊర చెరువు కట్టపై ఉన్న దేవాలయం లో నైవేద్యం పెట్టి మొక్కలు చెల్లించుకున్నారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నిండి నీటితో కళకళలాడాలని కోరుకున్నారు. అలాగే తమ కుటుంబాలను చల్లగా చూడాలని కుల దేవుడిని వేడుకున్నారు. ఉత్సవాలాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు బైరి రవి గౌడ్ పాల్గొని రజకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఏఎంసీ డైరెక్టర్ కొల్లూరి చందు, రజక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి కుమార్, రజక సంఘ నాయకులు కొల్లూరి మధునయ్య, కొల్లూరి శంకర్, కొల్లూరి రాజేశం ,అంతగిరి కొమురయ్య, ఎనగందుల గోపాల్, తోటపల్లి కుమార్, కొల్లూరి శ్రీనివాస్, దొరిసేటి తిరుపతి, తోటపల్లి రాజు, లక్ష్మణ్, కొల్లూరి మధు తదితరులు పాల్గొన్నారు.