Dharmaram | ధర్మారం, జూలై 12: ధర్మారం ఎస్సైగా ఎం ప్రవీణ్‌కుమార్ శనివారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ గతంలో పనిచేసిన ఎస్సై శీలం లక్ష్మణ్ ను ఈనెల 8న రామగుండం కమిషనరేట్ కు వీఆర్ కు బదిలీ చేస్తూ సీపీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఆయన స్థానంలో రామగుండం కమిషనరేట్ వీఆర్ లో ఉండి మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ కు అటాచ్డ్ గా ఉన్న ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ ను ధర్మారం మండలానికి బదిలీ చేశారు. దీంతో ఆయన శనివారం ధర్మారం పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించగా తోటి పోలీస్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.