Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్ జనవరి 2 : కాల్వశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన కందుల సురేష్ తన సెల్ ఫోన్ పోగొట్టుకోవడంతో కాల్వ శ్రీరాంపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసి ఫోన్ ని గుర్తించి దానిని దొరకబట్టారు. కాగా బాధితుడికి ఆ ఫోన్ని పోలీసులు శుక్రవారం అప్పగించారు.
ఈ సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేష్ మాట్లాడుతూ ఎవరైనా సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నా.. దొంగతనానికి గురైనా ఆ ఫోన్ వివరాలను CEIR పోర్టల్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పోర్టల్ ద్వారా మొబైల్ తిరిగి పొందే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఎవరికైనా మొబైల్ ఫోన్స్, అనుమానిత వస్తువులు, లేదా ఇతర విలువైన వస్తువులు గాని దొరికినట్లైతే వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించాలని కోరారు.