Traffic jam | మానకొండూర్ రూరల్, అక్టోబర్ 3 : కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదుల గట్టేపల్లి ఇది సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ మూడు కార్లను ఢీ కొన్న సంఘటనలో అవి ధ్వంసమయ్యాయి. ఓ కారు నుజు నుజ్జు అయింది. స్థానికులు తెలిపిన వివరాలు ఓ లారీ అతి వేగంగా వచ్చి కార్లను బలంగా ఢీ కొట్టడంతో కార్లు ధ్వంసం కాగా, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మూడు కార్లలో ఒక కారు నుజ్జు నుజ్జయ్యాయి.
నేషనల్ హైవే-563 రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగానే పనులు జరుగుతున్నాయి. వంతెన నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టి రోడ్డు ఎక్కువగా ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. నుజ్జునుజ్జైన కారు రోడ్డుపై ఉండటంతో రోడ్డుకు ఇరువైపులా దాదాపు 3 గంటలకు పైగా వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్ జామైంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. చివరికి రోడ్డు ఉన్న కారును ఓ క్రేన్ సాయంతో పక్కకు తొలగించి, ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేశారు. ఏంటి ప్రాణ నస్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు పాటించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.