NTPC Ash Loading | పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మల్యాలపల్లి బూడిద చెరువు నుంచి అక్రమంగా వసూలు చేస్తున్న లోడింగ్ చార్జీలు రూ.4,600 చెల్లించబోమని, ఈ వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం లారీల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సోమవారం అంతర్గామ్ మండలం మల్యాలపల్లి గేట్ వద్ద లారీల డ్రైవర్లు, ఎన్టీపీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్టీపీసీ జాతీయ రహదారుల నిర్మాణానికి ఒక టన్నుకు రూ.1260 చెల్లిస్తూ ఉండగా రవాణాచార్జీలను సైతం కట్టిస్తున్నారని తెలిపారు.
స్థానికంగా నివాసం ఉండే తాము ఎన్టీపీసీ విస్తరణతో భూ నిర్వాసితులం అయ్యామని తెలిపారు. దీనికి తోడు ఎన్టీపీసీ నుంచి వచ్చే బూడిదతో తరుచుగా అనారోగ్యాల భారీన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై ఎన్టీపీసీ యాజమాన్యం సానుభూతి కూడా చూపడం లేదన్నారు. ఇప్పటికైనా ఉచితంగా బూడిద లోడింగ్ చేపట్టేందుకు ముందుకు రావాలని ఎన్టీపీసీని కోరారు. ఈ కార్యక్రమంలోబీఆర్ఎస్ నేత, కార్మిక సంఘాల నాయకుడు కౌశిక్ హరి, రామగుండం యాష్ టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు బడికెల శేఖర్తోపాటు లారీ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.