Loka Bapu Reddy | కథలాపూర్, ఏప్రిల్ 22 : తెలంగాణ రైతులకు వ్యవసాయం ఆంధ్ర ప్రాంతం వారు నేర్పించారన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సహాయ కార్యదర్శి లోక బాపు రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ రైతులకు ఆంధ్రప్రాంతం వారు వ్యవసాయం నేర్పించారని పీసీసీ అధ్యక్షుడు మాట్లాడటం యావత్ తెలంగాణ సమాజాన్ని అవమాన పరిచినట్టే. రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు మహోత్సవ వేడుకలు జరపడం.. చంపినోడే.. సంతాప సభ పెట్టినట్టు ఉందన్నారు.
కేసీఆర్ చెప్పేది అక్షర సత్యం.. బీఆర్ఎస్కు తప్ప తెలంగాణ మీద ఏ రాజకీయ పార్టీకి ప్రేమ ఉండదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర భావదారిద్ర్యంలో ఉన్నారు. ఆంధ్ర పాలకుల మన్ననల కోసం ఇంకా ప్రాకులాడడం సిగ్గు చేటు. నాడు తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడ్డ సమైక్య పాలకుల అడుగులకు మడుగులొత్తిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు సొంత రాష్ట్రంలో ఉన్నామనే సోయి మరిచినట్టు ఉన్నారు.
కోస్తా ప్రాంతంలో వరి తప్ప ఏది పండించరు..తెలంగాణ వ్యవసాయ చరిత్ర తెలియని వ్యక్తులు.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు పాలకులు కావడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం ఆంధ్రలోని కోస్తా ప్రాంతంలో వరి తప్ప ఏది పండించరు. కానీ తెలంగాణ రైతులు వరితోపాటు వాణిజ్య పంటలైన పత్తి, పసుపు, చెరుకు, మిర్చి, మొక్కజొన్న పంటలు పండిస్తారు. పల్లి, పెసర, శనగ, కందులు, మినుములు లాంటి ఆహార ధాన్యాలు పండిస్తారన్నారు.
వెయ్యేళ్ళ క్రితమే దక్కన్ ప్రాంతంలో సన్నబియ్యం పండించిన చరిత్ర తెలంగాణ రైతులది. వ్యవసాయ రంగంలో నిష్ణాతులైన తెలంగాణ రైతులను అవమానించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెంటనే యావత్ తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని లోక బాపు రెడ్డి డిమాండ్ చేశారు.
అనంతరం ఆయన హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి.. ఈ నెల 27 న వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభకు సంబంధించిన పలు విషయాలపై చర్చినట్లు తెలిపారు.
Drinking Water | మిషన్ భగీరథపై అధికారుల నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపు కరువు
Kollapur Mangos | కొల్లాపూర్ మామిడి రైతులను ఆదుకోవాలి : బీఆర్ఎస్ నాయకులు అభిలాష్ రావు
Rayapol ZPHS | విద్యా వెలుగులకు నెలవై.. రాయపోల్ పెద్ద బడికి నేటికి 60 వసంతాలు