చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా త్వరలోనే పశువులకు బీమా పథకం( Insurance Scheme) వర్తింపజేస్తామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎన్, లింగారెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలోని ఇందుర్తి గ్రామంలో శుక్రవారం పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీమా వల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న 1.18 లక్షల పశువులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని వివరించారు. అన్ని మండలాల్లో పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేసి దూడల ర్యాలీ, పశు విత్తనాల పరీక్షలు, పశువులకు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కృత్రిమ గర్భధారణ ఉత్పత్తికి పరీక్షలు, పశు ఉత్పత్తి పెంపొందించుటకు రైతుకు సూచనలను అందజేశామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ సంచాలకులు డాక్టర్ వినోద్ కుమార్, మండల పశువైద్యాధికారులు సాంబరావు, శ్రీనివాస్ రెడ్డి వెటర్నరీ లైఫ్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి, లైవ్ స్టాక్ అసిస్టెంట్ సత్యం, గోపాల మిత్రులు కుమారస్వామి, సంపత్, రాజేశం సర్పంచ్ చింతపూల నరేందర్, ఉప సర్పంచ్ చింతపూల అనిల్, రైతులు పాల్గొన్నారు.