kargil Vijay Diwas | భారత సాయుధ దళాల ధైర్యసాహసాలు, శౌర్యం, అత్యున్నత త్యాగాలకు గౌరవపూర్వకంగా లులు మాల్ (LULU Mall)లో ‘కార్గిల్ విజయ్ దివస్’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘అమర్ జవాన్’ నివాళి కార్యక్రమం, రక్షణ రంగానికి సంబంధించిన ప్రదర్శన యువతలో, విద్యార్థుల్లో ఎంతగానో దేశభక్తిని నింపాయి.
1999 కార్గిల్ యుద్ధంలో మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఈ కార్యక్రమం ద్వారా ఘన నివాళులర్పించారు. భారత రక్షణ రంగానికి ఉన్న ఘనమైన చరిత్రను, దేశ సేవలోని అమూల్యమైన స్ఫూర్తిని సందర్శకులకు తెలియజేసేలా ఈ ప్రదర్శనను రూపొందించారు.
ఈ కార్యక్రమంలో మౌంట్ లిటెరా జీ స్కూల్’ , కూకట్పల్లి విద్యార్థులు, ఉపాధ్యాయులు, మాల్ సందర్శకులో పాల్గొని వీరులకు నివాళులర్పించారు. మాల్ అట్రియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ద్వారా కార్గిల్ విజయ్ దివస్ ప్రాముఖ్యతను భావి తరాలకు అర్థమయ్యేలా వివరించారు.
షరీఫ్ (రీజినల్ మేనేజర్, లులు మాల్)..
“కార్గిల్ విజయ్ దివస్ అనేది ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణమైన మరియు స్మరించుకోవాల్సిన రోజు. మన సాయుధ దళాల ధైర్యసాహసాలను విద్యార్థులకు తెలియజేయడానికి, దేశాన్ని నిరంతరం నడిపించే వారి త్యాగాలను వారు అర్థం చేసుకోవడానికి ఈ వేడుక ఒక మంచి వేదికగా నిలిచింది. విద్యార్థులు ఎంతో గౌరవంతో, ఆసక్తితో ఈ ‘అమర్ జవాన్’ ప్రదర్శనను సందర్శించడం చాలా సంతోషాన్నిచ్చింది
అమర్ జవాన్ నివాళి వేదిక :
కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్ల అత్యున్నత త్యాగానికి గుర్తుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్మారక ప్రదర్శన
విద్యార్థుల సందర్శన :
స్థానిక పాఠశాలల విద్యార్థులు గైడ్ల సమక్షంలో ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించి, భారత మిలిటరీ చరిత్ర, సాయుధ దళాల విశిష్టత గురించి విలువైన విషయాలను తెలుసుకున్నారు. సామాజిక బాధ్యతతో కూడిన ఇటువంటి కార్యక్రమాల ద్వారా ‘లులు గ్రూప్’ నిరంతరం ప్రజలతో అనుబంధాన్ని పెంపొందించుకోవడమే కాకుండా, యువతలో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోంది.