Literacy training | కాల్వ శ్రీరాంపూర్, జనవరి 1 : కాల్వ శ్రీరాంపూర్ మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ మామిడి లత అశోక్ ఆధ్వర్యంలో చిన్నారులకు గురువారం అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ సావిత్రి మాట్లాడుతూ చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు.
అనంతరం నూతన సంవత్సరం సందర్భంగా సర్పంచి లతను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త సిద్ధం శారద, ఆయా త్రివేణి తదితరులు పాల్గొన్నారు.