pegdapally | పెగడపల్లి: పెగడపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో గల అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మండల ఐసిడిఎస్ సూపర్వైజర్లు మహేశ్వరి, సుభద్ర మాట్లాడారు.
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మంచి పోషకాహారాలను అందించడంతోపాటు ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తల్లులు చిన్నారులు ఉన్నారు.