Lions Club | రుద్రంగి, జూన్ 22: లయన్స్ క్లబ్ రుద్రంగి 2025-28 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గంను మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ లయన్ హనుమన్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. లయన్స్ క్లబ్ రుద్రంగి అధ్యక్షులుగా బండి యాదగిరి, సెక్రటరీగా కొమురె శంకర్, కోశాధికారిగా మంచె రాజేశం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రుద్రంగి అధ్యక్షులు బండి యాదగిరి మాట్లాడుతూ సమాజ సేవా కార్యక్రమంలో ముందుండి రుద్రంగి పరిసర గ్రామాలకు సేవా కార్యక్రమాలు అందిస్తామని తెలిపారు.
మన దగ్గర ఉన్న పేదవారికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ లయన్ హనుమన్ల రాజిరెడ్డి మాట్లాడుతూ సేవ చేయాలనే వారికి లయన్స్ క్లబ్ మంచి వేధికగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ లయన్ రాపెల్లి శ్రీధర్, ఆర్సి లయస్ కంటె శంకర్, ఎంజెఎఫ్ తీపిరెడ్డి వెంకట్రెడ్డి, సభ్యులు గడప రఘుపతిరావు, తీగల శశిధర్రావు, అంబటి శంకర్, గోడికార్ హీరోజి, మరిపెల్లి అంతయ్య, పుట్కపు మహేష్, పడాల రాజేశంలతో పాటు తదితరులు పాల్గొన్నారు.