Lions Club | రామగిరి, మే23:పన్నూరు గ్రామానికి చెందిన పుట్ట రజితకు వివాహం కుదిరింది. కాగా రజిత తండ్రి శంకరయ్య 15 యేండ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రజితకు వివాహం చేయడం తల్లి రాధమ్మకు శక్తికి మించిన భారంగా మారింది. ఆమె కుటుంబ పరిస్థితిని కుటుంబ సభ్యులు లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో నిరుపేద వధువు వివాహానికి లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి సభ్యుల సహాకారంతో సేకరించినరూ. 22116 అమ్మాయి కి పెళ్లి పందిరిలో శుక్రవారం అందించారు. పెద్దమనుసుతో నిరుపేద యువతి వివాహానికి చేయూతనందించిన లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి సభ్యులను పన్నూర్ గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి అధ్యక్షులు లయన్ వేల్పుల రమేష్, సెక్రటరీ లయన్ బోడకుంట రాంకిషన్, పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ సాదుల వెంకటేశ్వర్లు, సీనియర్ సభ్యులు లయన్ బెల్లంకొండ జయపాల్ రెడ్డి, లయన్ దుబాసి కుమార్ తదితరులు పాల్గొన్నారు.