plastic-free constituency | చిగురుమామిడి, ఆగస్టు 28: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత నియోజకవర్గం గా తీర్చిదిద్దేందుకు అందరం కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి పొన్నం మంజుల అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని 17 గ్రామ సంఘాలకు స్టీల్ బ్యాంకు (వంట పాత్రలు) గురువారం అందించారు. ప్రతీ ఇంట్లో స్టీల్ పాత్రలను వాడాలని కోరారు.
అల్యూమినియం పాత్రలతో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలోని అన్ని మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకు పాత్రలను పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, డీఆర్డీవో ఏపీడీ రవికుమార్, తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో మధుసూదన్, ఏపీఎం మండల రజిత, ఉదయలక్ష్మి, మండల సమాఖ్య అధ్యక్షురాలు రజిత, సీసీలు సత్యనారాయణ, వెంకటమల్లు, గంప సంపత్ కుమార్, దుబ్బాక వెంకటేశ్వర్లు, వివోఏలు, మహిళలు పాల్గొన్నారు.