Korutla | కోరుట్ల, మే 30: వయోవృద్ధులను వేధిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోరుట్ల తహసీల్దార్ కృష్ణ చైతన్య అన్నారు. శుక్రవారం జిల్లా సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో కోరుట్ల డివిజన్ కార్యవర్గ సభ్యులు మండల తహసీల్దార్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎమ్మార్వోను కలిసి సన్మానించారు.
అనంతరం సీనియర్ సిటీజన్స్ చట్టం పుస్తకాలను తహశీల్దార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ జిల్లాలో సీనియర్ సిటీజన్స్ సమస్యలను జిల్లా కలెక్టర్, ఆర్డీవోల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తున్న రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల అసోసియేషన్ ప్రతినిధులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో అసోసియోషన్ డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం, కార్యదర్శి గంటేడి రాజ్ మోహన్, ఉపాధ్యక్షుడు సైఫోద్దీన్, గౌరవ సలహాదారు వెంకటేశ్వరరావు, డివిజన్ కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.