Learning capabilities | పెద్దపల్లి కమాన్, ఆగస్టు 13 : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే అభ్యసన సామర్థ్యలు పెంచేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలని డీఈవో మాధవి సూచించారు. పెద్దపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం మండల స్థాయి ఎఫ్ఎల్ఎన్ -టీఎల్ఎం మేళాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి తడబడకుండా చదవడం, రాయడంలో పట్టు సాధించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమీక్ అధికారి పీఎం షేక్, హెచ్ఎంలు హనుమంతు, పురుషోత్తం, ఆగయ్య, మనోహర్, కృష్ణారెడ్డి, వెంకటస్వామి పాల్గొన్నారు.