హుజూరాబాద్ టౌన్, డిసెంబర్ 12: హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా పాడి కౌశిక్‌రెడ్డికి మంగళవారం అధికారులు, నాయకులు, కార్యకర్తల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పట్టణంలోని సిటీ సెంటర్ హాల్లో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి, శాలువాలు కప్పి సత్కరించారు. ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎంపీపీ ఇరుమల్ల రాణీసురేందర్రెడ్డి, ఎంపీడీవో జయశ్రీ, డిపో మేనేజర్ పీ అర్పిత, ఏపీవో వేముల సురేందర్, ఏడీఏ సునీత, ఏవో సునీల్‌కుమార్, ఏఈవోలు, మహిళా సంఘాల నాయకురాళ్లతోపాటు పాస్టర్లు డేవిడ్, నవీన్, డానియల్, బీఆర్ఎస్ నాయకులు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పట్టణ, మండల అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, సంగెం ఐలయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు వనితాకుమారస్వామి, బీ యాదగిరినాయక్, మక్కపెల్లి కుమార్‌యాదవ్, తిరుమల్‌రెడ్డి, ముత్యంరాజు, శివ, గోవిందుల స్వప్నాభాస్కర్, ఎం కొండల్‌రెడ్డి, తొగరు సదానందం, కోండ్ర జీవితానరేశ్, కే రమాదేవీరోషేందర్, మారెపల్లి సుశీల, ఉజ్మానూరిన్ఇమ్రాన్, మంజులాకృష్ణ, గనిశెట్టి ఉమామహేశ్వర్, కే లావణ్య, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, ముక రమేశ్, పాల కిషన్, నాయకుడు గందె శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, నాయకులు పంజాల కుమారస్వామి, బత్తుల సమ్మయ్య, కోండ్ర నరేశ్, ములుగు పూర్ణచందర్, ఇమ్రాన్, దిల్ శ్రీనివాస్, డిష్ రమేశ్, అనిల్‌యాదవ్, సమ్మారావు, గంట మధూకర్, కొమురయ్య, లక్ష్మణమూర్తి, అమ్జదుల్లాఖాన్, లక్ష్మారెడ్డి, నిరోషాకిరణ్, వెంకట్ అనిత, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్వై నియోజకవర్గ ఇన్చార్జి తొగరు శివకృష్ణ మంగళవారం హుజూరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువా కప్పి సత్కరించారు. అలాగే, మండలంలోని పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని కలిసి సత్కరించారు.
ఎమ్మెల్యేను కలిసిన బీఆర్ఎస్ నాయకులు
మండల కేంద్రంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారి వీణవంకకు వచ్చిన పాడి కౌశిక్‌రెడ్డిని మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ బీఆర్ఎస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాకప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దాసారపు కృష్ణచైతన్య, దాసారపు రాజేందర్, లింగయ్య, బతుకయ్య, పులాల మొండయ్య, సామ్రాట్, దాసారపు ఓదెయ్య, రాధాకృష్ణ, సారయ్య, ఓదెలు, రాజయ్య, రాజేంద్రప్రసాద్, నాగరాజు, శ్రీనివాస్, రాజు, రాంచందర్, లక్ష్మణ్, పోచయ్య, శ్యామ్, కుమార్, పుల్లూరి రాణాప్రతాప్, దిలీప్, దాసారపు శంకర్, వేణు, అజయ్, కొమురయ్య, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.