Support KCR | వేములవాడ, జూన్ 11: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ ముందట హాజరుకాబోతుండగా బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో దాదాపు 200 మంది బుధవారం హైదరాబాద్ తరలి వెళ్లారు. పార్టీ కార్యాలయం నుండి బీఆర్ కే భవన్ వరకు సాగిన ర్యాలీలో పాలుపంచుకొని మద్దతు నిలిచారు. 60 ఏళ్ల పాలనలో వెనుకబడిన తెలంగాణ లో బీడు భూములకు గోదావరి జలాలను ఎత్తిపోసి సస్యశ్యామలం చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ పై ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసిన ప్రజలు నమ్మబోరని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ లోకబాపురెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ ఉమా, పార్టీ మండల అధ్యక్షులు గోస్కుల రవి, మ్యాకల దేవయ్య, మ్యాకల ఎల్లయ్య, తిరుపతి, సత్తిరెడ్డి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, సెస్ డైరెక్టర్లు రేగులపాటి హరిచరణ్ రావు, ఆకుల దేవరాజం, ఆకుల గంగారం, సింగిల్ విండో చైర్మన్లు బండ నరసయ్య యాదవ్, రామ్మోహన్ రావు, మాజీ జెడ్పిటిసి మ్యాకల రవి, నాయకులు రాఘవరెడ్డి, ఆర్ సి రావు, చంద్రయ్య గౌడ్, గంగం మహేష్, నిమ్మశెట్టి విజయ్, ఆనందం, అశోక్ తో పాటు దాదాపు 200 మంది తరలి వెళ్లారు.