హుజూరాబాద్ రూరల్, జనవరి 21: కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు యతిపతి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం హుజూరాబాద్‌లో న్యాయవాదులు ధర్నా చేశారు. కోర్టు నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. హుజూరాబాద్‌కు జిల్లాకు ఉండవల్సిన సౌకర్యాలు ఉన్నాయని, వెంటనే జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నూతల శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు నల్ల భూమి రెడ్డి, ముకెర రాజమౌళి, గోసుల శ్రీనివాస్, జి లక్ష్మణ మూర్తి, బత్తుల తిరుపతి, విక్రమ్, కొత్తూరి రమేష్, ప్రభు, కొండయ్య, లింగ మూర్తి, శిరీష, మౌనిక, దివ్య, అంజలి, ఆకుల శ్రీనివాస్, జాఫర్, శ్రవణ్, మురళి, రవి తేజ, అశోక్, అనిల్, నాగరాజు, హరిహరన్ , పిట్టల రాజేష్, భాను కిరణ్, మాటెలా తిరుపతి, కుమార్, మోరే కళ్యాణ్ ఉన్నారు.