Collector Koya Sri Harsha | పెద్దపల్లి, జూలై19: ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులలో భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. విద్యార్థులలో విద్యా ప్రమాణాల పెంపుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ శనివారం సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవలే నిర్వహించిన సర్వేలో ప్రభుత్వ పాఠశాలలో చదివే 9, 10వ విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం చదివి అర్థం చేసుకోవడం కేవలం 53 శాతం మాత్రమే చేయగలుగుతున్నారని వెల్లడైందన్నారు.
భాష అర్థం చేసుకోలేక పోతే మ్యాథ్స్, సైన్స్ వంటి పాఠ్యాంశాలు అర్థం చేసుకోలేరని, భాషపై కనీస పరిజ్ఞానం పెరిగే విధంగా హెచ్ఎంలు చర్యలు తీసుకోవాలన్నారు. మాథ్స్, సైన్, సోషల్ సబ్జెక్ట్లలో కూడా జిల్లా విద్యార్థులు చాలా వెనబడి ఉన్నట్లు తెలుస్తుందని, ఉపాధ్యాయులు వినూత్న పద్దతులలో విద్యాభోదన చేయాలని సూచించారు. ఇప్పటికైన విద్యార్థులలో విద్యాప్రమాణాలు పెంపొందించకుంటే చర్యలుంటాయని హెచ్చారించారు. సమావేశం డీఈవో మాధవి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.