Land survey | సరిహద్దులు చూపిన తర్వాతనే భూ సర్వేను చేపట్టాలి.. ఓబులాపూర్ గ్రామస్తుల డిమాండ్
మల్లాపూర్ మండలంలోని ఓబులాపూర్ గ్రామ పరిధిలోని భూములను సంబధించిన సరిహద్దులను చూపిన తర్వాతనే అధికారులు పక్క గ్రామమైన సంగెం-శ్రీరాంపూర్ గ్రామంలో భూ సర్వేను చేపట్టాలని ఓబులాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు.
Land survey | మల్లాపూర్, ఆగస్టు 31 : మల్లాపూర్ మండలంలోని ఓబులాపూర్ గ్రామ పరిధిలోని భూములను సంబధించిన సరిహద్దులను చూపిన తర్వాతనే అధికారులు పక్క గ్రామమైన సంగెం-శ్రీరాంపూర్ గ్రామంలో భూ సర్వేను చేపట్టాలని ఓబులాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులు భూముల సమస్యలపై ప్రత్యేకంగా సోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ గ్రామానికి సరిహద్దులు చూపాలని మండల, జిల్లా స్థాయి అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేదని, తమ గ్రామానికి చెందిన రైతులకు ఎలాంటి సమాచారంలో లేకుండా రెవెన్యూ అధికారులు ప్రస్తుతం తమ భూములను ఆనుకోని ఉన్న సంగెం-శ్రీరాంపూర్‌లో భూ సర్వేను చేస్తున్నారని, ఈ సర్వేను అధికారులు ఇష్టానుసారంగా చేయడం సరికాదన్నారు.
ఇప్పటికైన సంబధిత ఉన్నత అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కారించాలని, లేని పక్షంలో గ్రామస్తులందరూ కలెక్టరేట్‌కు వెళ్లి నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు తోట రాజరెడ్డి, ఆకుల భీమయ్య, కోటగిరి రాజాగౌడ్, పందెన రవి, రేండ్ల భూమారాజం, పందెన శేఖర్, సుతారి భూమేష్, దొంతుల రాజు కుమార్, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

