Land problems | కథలాపూర్, జూన్ 5 : భూ భారతి చట్టంతో భూమి సమస్యలు పరిష్కారం అవుతాయని కోరుట్ల ఆర్డీవో దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. కథలాపూర్ మండలం దూలూరు, బొమ్మెన గ్రామాల్లో భూ భారతి చట్టంపై గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి సమస్యలు ఉంటే రైతులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
రైతుల సందేహాలను నివృత్తి చేశారు. దూలూరు గ్రామంలో 65 మంది, బొమ్మెన గ్రామంలో 18 మంది రైతులు సమస్యలపై దరఖాస్తులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ లు నాగేష్, సోహెల్ పాల్గొన్నారు.