AGNIVEER | సిరిసిల్ల రూరల్, మార్చి 29: అగ్నివీర్ కు తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన యువకుడు వట్టిమల్ల సాయితేజ ఎంపికయ్యారు. సాధారణ కుటుంబానికి చెందిన వట్టిమల్ల సాయితేజ స్థానికంగానే విద్యను పూర్తి చేశారు.
తల్లిదండ్రులు లక్ష్మణ్, రాణి వ్యవసాయ పనులు చేస్తూ కుమారుడిని చదివిపించారు. దీంతో పాటు లక్ష్మణ్ స్కూల్ కు ఆటో నడిపేవాడు. తల్లిదండ్రుల కష్టాన్ని చేస్తూ పెరిగిన సాయితేజ భారతదేశ సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతో సాయితేజ గత రెండేళ్లుగా కరీంనగర్ లో ఉంటూ శిక్షణ పొందుతున్నాడు.
ఇటీవలే ప్రకటించిన అగ్నివీర్ జనరల్ డ్యూటీ కేటగిరి ఫలితాల్లో ప్రతిభకనబరిచి తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. అగ్నివీర్ కు ఎంపికైన యువకుడు సాయితేజ ను గ్రామ యువకులు , పెద్దలు అభినందనలు తెలిపారు.