Laddu auction | ధర్మారం, సెప్టెంబర్7 : ధర్మారం మండల కేంద్రం లోని ని పాత బస్టాండ్ బోయవాడ, శ్రీ రామాలయం ఎదుట శ్రీకృష్ణ యూత్ ప్రతిష్టించిన గణేష్ మండపాల వద్ద ఆదివారం వేరువేరుగా స్వామి వారి లడ్డు వేలం పాటలు నిర్వహించగా, గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా విజేతలను ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు. బోయవాడ గణపతి మండపం వద్ద లడ్డు వేలం పాట ఎంతో ఆసక్తికరంగా జరిగింది. లడ్డు దక్కించుకోవడానికి పలువురు పోటీపడ్డారు. చివరకు రూ.41,000 లకు దాగేటి ఉదయ్ యాదవ్ దక్కించుకున్నారు.
స్వామి మెడలోని రూ.10 రూపాయల బిల్లలా దండ (రూ.6,500) విలువ గల దానిని రూ. 12,500 లకు కల్వల కిషన్ దక్కించుకున్నారు.స్వామి వారి మెడలోని రూ.100 దండ (రూ.5000 విలువ గల)దానిని రూ.12,500 లకు పాలకుర్తి రాజేశం గౌడ్ దక్కించుకున్నారు.రూ. 10 నోట్ల దండ (రూ.1,000 విలువ గల) దానిని రూ. 5,000 లకు తోడేటి కరుణాకర్ దక్కించుకున్నారు.రూ.10 (రూ.100 విలువ గల) స్వామి వారి అభయ హస్తంకు ఉన్న దండ ను ఎండి షోయబ్ దక్కించుకున్నారు ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు, బోయవాడ ప్రజలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా విజేతల ప్రకటన
ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ రామాలయం ఎదుట ప్రతిష్టించిన విఘ్నేశ్వరుడి మండపం వద్ద ఆదివారం ఉత్సవ కమిటీ సభ్యులు లక్కి డ్రా విజేతలను ప్రకటించి వారికి బహుమతులు అందజేశారు.
విజేతల వివరాలు
ప్రథమ బహుమతి : ( 2.5 గ్రాములు -పావుతులం బంగారం)-కందుకూరి వరన్య
ద్వితీయ బహుమతి : (10తులాల వెండి)-దాగేటి ఉదయ్ యాదవ్
మూడో బహుమతి : (డ్రెస్సింగ్ టేబుల్ )-పెరుమాండ్ల మహేష్
నాలుగో బహుమతి : (ఇండక్షన్ స్టవ్)-చింతల స్రవంతి
ఐదో బహుమతి : (హోమ్ థియేటర్)- తుమ్మల మధురమ్మ