NREGS | తిమ్మాపూర్, ఆగస్టు 22 : తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని దినాలు పూర్తి చేసుకున్న కూలీలను గ్రామ ప్రత్యేక అధికారి జే సురేందర్ శుక్రవారం సన్మానించారు.
అనంతరం గ్రామంలోని పట్నంశెట్టి నాగయ్య నిర్మించుకున్న నాడెపు కంపోస్టును గ్రామ కార్యదర్శి రమాదేవి తో కలిసి ప్రారంభించారు. గ్రామ అభివృద్ధికి అందరూ పాటుపడాలని ప్రత్యేక అధికారి సురేందర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.