Bar Association | మంథని: మంథని బార్ అసోసియేషన్ కు గురువారం ఎన్నికల నిర్వహించారు. కాగా, అధ్యక్షునిగా కేవీఎల్ఎన్ హరిబాబు, ఉపాధ్యక్షుడిగా కేతిరెడ్డి రఘోత్తంరెడ్డి, జాయింట్ సెక్రెటరీగా విజయ్ కుమార్, కోశాధికారిగా రాచర్ల రాజేందర్, లైబ్రరీ సెక్రెటరీగా శ్రీనివాస్, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా ఆర్ల నాగరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా సంతోష్, షబానా లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పాపయ్య పేర్కొన్నారు.
ఎన్నికకు సహకరించిన వారందరికీ పాలకవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సమస్యల పట్ల పోరాడుతామని నూతనంగా ఎన్నికైన పాలకవర్గం పేర్కొన్నారు.