Kuchipudi | మంథని, డిసెంబర్ 29 : కూచిపూడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో శ్రేష్ఠ కిడ్స్ పాఠశాల విద్యార్థినీ అత్యుత్తమ ప్రతిభ కనబర్చినట్లు పాఠశాల కరస్పాండెంట్ క్రాంతికుమార్, ప్రిన్సిపాల్ బిందు సోమవారం తెలిపారు.
హైదరాబాద్లోని గడ్చిబౌలి స్టేడియంలో కూచిపూడి కళా వైభవం భారత్ ఆర్డీ ఆకాడమీ నిర్వహించిన మహాబృంద నాట్యంలో మంథనిలోని శ్రేష్ఠ కిడ్స్ పాఠశాలకు చెందిన సిరిపురం శ్రేష్ఠ పాల్గొని కూచిపూడి నాట్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి బమతులు సాధించారు. నాట్యంలో ప్రతిభ కనబర్చిన శ్రేష్ఠను పాఠశాల అధ్యాపక బృందం, మంథనికి చెందిన పలువురు ప్రత్యేకంగా అభినందించారు.