రాజన్న సిరిసిల్ల, నవంబర్ 14(నమస్తే తెలం గాణ)/కథలాపూర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాన్ని హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బుధవారం వేములవాడ నియోజకవర్గానికి వస్తున్నారు. ఉదయం 11గంటలకు కథలాపూర్ మండల కేంద్రంలోని కాలువ పక్కన మైదానంలో వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించే కథలాపూర్, మేడిపల్లి మండలాల ప్రజా ఆశీర్వాద సభకు హాజరై ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు రుద్రంగి, 01.30 గంటలకు చందుర్తి, 2గంటలకు కోనరావుపేట, 3.30గంటలకు వేములవాడ, 6గంటలకు తంగళ్లపల్లి మండలాల్లో రోడ్‌షోలో పాల్గొననుండగా, పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ నేడు వేములవాడ నియోజకవర్గంలో పర్యటించను న్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారా వుకు మద్దతుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య క్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి బహి రంగ సభతోపాటు రోడ్‌షోల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, కోరుట్ల మీదుగా బుధవారం కథలాపూర్ మండలానికి చేరుకుంటా రు. ఉదయం 11గంటలకు వరద కాలువ పక్కన మైదానంలో జరిగే కథలాపూర్, మేడిపల్లి మండ లాల ప్రజా ఆశీర్వాద సభకు హాజరై ప్రసంగి స్తారు. కథలాపూర్, మేడిపల్లి, బీమారం మండలా ల పెద్ద సంఖ్యలో 12వేల మందికిపైగా సభలో పాల్గొననుండగా, ఏర్పాట్లు పూర్తిచేసినట్లు మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వొద్దినేని హరిచరణ్‌రావు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు రుద్రంగి, 01.30 గంటలకు చందుర్తి, 2గంటల కు కోనరావుపేట, 3.30గంటలకు వేములవాడ, 6గంటలకు తంగళ్లపల్లి మండలాల్లో రోడ్‌షో మండలాల్లో రోడ్‌షోలో పాల్గొంటారు. కాగా, ప్రచారంలో భాగంగా తమ మండలానికి మొదటి సారి వస్తున్న రామన్నను చూసేందుకు మేడిపల్లి, కథలాపూర్, భీమారం మండలాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కేటీఆర్ సభకు శరవేగంగా ఏర్పాట్లు
చందుర్తి, నవంబర్ 14: ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామ ప్రవేశ మార్గంలో గల మైదానంలో భారీ వేదికను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ మండల ఇన్చార్జి శ్రీధర్ దగ్గరుండి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నానే. సుమారు పదివేల మందితో సభ జరగనుండగా, అసౌకర్యం కలుగకుండా తాగునీరు, షామియానాలు ఏర్పా టు చేస్తున్నారు. యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ఈర్లపల్లి రాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, వైస్‌ఎంపీపీ అబ్ర హం, సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ పెగ్గర్ల రమేశ్‌రావు, సెస్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ అశోక్, కేటీసీబీ డైరెక్టర్ కిషన్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్, అధ్యక్షుడు కమలాకర్‌రావు ఉన్నారు.