KTR | సిరిసిల్ల టౌన్, మే 11: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆదివారం సిరిసిల్లలో పర్యటించారు. స్థానిక నెహ్రూనగర్ లోని భవాని కల్యాణ మండపంలో జరిగిన బీఆర్ఎస్ నాయకుడు మామిడాల రమణ కొడుకు మామిడాల శ్రీనాథ్- లాస్య వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అక్కడి నుండి అంబాభవాని ఆలయంలో జరిగిన మాజి మున్సిపల్ కౌన్సిలర్ చిలుక నారాయణ మనవడు పవన్- శన్విక వివాహ వేడుకలకు హాజరయ్యారు.
బీఆర్ఎస్ నాయకుడు సయ్యద్ సోహెల్ ఇటీవల ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవ్వగా కొత్తబస్టాండ్ లోని వారి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అర్బన్ బ్యాంకు వైస్ చైర్మన్ అడ్డగట్ల మురళి కొడుకు క్రాంతికుమార్- కీరవాణి వివాహం ఇటీవల జరగగా శాంతినగర్ లోని వారి నివాసానికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించి వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. తరువాత రాజీవ్‌నగర్ కు చెందిన బీఆర్ఎస్ నేత అలువాల ఈశ్వర్ ఇంటికి వెళ్లి ఆయన కూతురు వివాహం ఇటీవల జరగగా నూతన దంపతులను ఆశీర్వదించారు.
అనంతరం ఎల్లారెడ్డిపేటకు బయలుదేరి వెళ్లారు. ఇక్కడ నాఫ్ స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, మున్సిపల్ మాజి చైర్పర్సన్ జిందం కళ, బొల్లి రామ్మోహన్, మంచె శ్రీనివాస్, న్యాలకొండ రాఘవరెడ్డి, మ్యాన రవి, సత్తార్, అన్నారం శ్రీనివాస్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, ఆయా మండలాల బీఆర్ఎస్ నాయకులు, తదితరులున్నారు.