Himanshu | రాజన్న సిరిసిల్ల, మే 25(నమస్తేతెలంగాణ)/వేములవాడ టౌన్, మే 25: రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. మొదట సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు వారి స్నేహితులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో వారికి అర్చకులు ఘనంగా స్వాగతంపలికారు. ఆలయంలో వారు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈఓ రమాదేవి వారికి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
సిరిసిల్ల తెలంగాణ భవన్ లో సందడి
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ కు వేములవాడ దర్శనం తర్వాత చేరుకున్నారు. తెలంగాణ భవన్లో ఆయనకు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ భవన్లో తన స్నేహితులతో కలిసి భోజనం చేశారు. పార్టీ నేతలను బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ నేతలను పరిచయం చేశారు. తర్వాత గంభీరావుపేట మండల కేంద్రంలో కేజీ టూ పీజీ కళాశాల సందర్శనకు వెళ్లారు.