Vemulawada | వేములవాడ, జూలై 24 : వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులువేములవాడ భీమేశ్వర ఆలయంలో శుక్రవారం కోడె మొక్కలు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. భీమేశ్వర ఆలయంలో కోడే మొక్కులు చెల్లించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కేటీఆర్ నూరేళ్ల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా వేడుకుంటూ భగవంతుని కోరుకున్నట్లు వారు తెలిపారు.
అనంతరం యాచకులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, సీనియర్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, కమలాకర్ రెడ్డి, సిరిగిరి రామచందర్, మారం కుమార్, జోగిని శంకర్, సత్యనారాయణ రెడ్డి, చీటి రాధా కిషన్ రావు, రాంబాబు, అంజత్ పాషా, గుడిసె సదానందం, రేగుల రాజేశం, రాము గౌడ్, సంజీవ్, రాజు, ఉమర్ తదితర నాయకులు ఉన్నారు.