KTR birthday | పెద్దపల్లి కమాన్, జులై 24 : బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద నిర్వహించిన సంబురాలల్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాసరి మనోహర్ రెడ్డి కేక్ కట్ చేసి, స్వీట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆశాజ్యోతి కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బాగుoడాలని అన్నారు. భవిషత్లో మరింత ఉన్నతస్థాయి లో నిలువాలని ఆకాంక్షించారు. నాయకులు ఉప్పు రాజ్ కుమార్, మరుకు లక్ష్మన్, పెద్ది వెంకటేష్, కొయ్యడ సతీష్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.