Gambhiraopet | గంభీరావుపేట, జులై 23 : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బందికి కేటీఆర్ జన్మదిన కానుకగా గురువారం ఉపసర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి దుస్తులు పంపిణీ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని 50 మంది పంచాయతీ కార్మికులకు దుస్తులు పంంపిణీ చేశారు. రామన్న అందరి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ అందరికీ సేవలు ఎప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.