KTR birthday | జగిత్యాల : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆదేశానుసారం యువ నాయకులు ఎల్ కార్తికేయ సౌజన్యంతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసంలోని పిల్లలకు బీఆర్ఎస్ శ్రేణులు గురువారం భోజనం, పండ్లు, స్వీట్ల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఆవారి శివకేశారి బాబు, ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద్ రావు, వొళ్ళేం మల్లేశం, వొళ్ళాల గంగాధర్, దయ్యాల మల్లారెడ్డి, వనమాల నిరంజన్, కోరుకంటి రాము, వేంకటేశ్వర్ రావు, నవ్వోత్ రవీందర్, పెండెం గంగాధర్, కావేటి నవీన్, కోటగిరి మోహన్, అజ్ఘర్ ఖాన్, గాజుల శ్రీనివాస్, గడ్డం లక్ష్మీపతి, సజీల్, ఎంఏ వసీం, గంగిపెల్లి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.