KTR birthday | సుల్తానాబాద్ రూరల్, జూలై 24 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ బీసీ సెల్ మండల ఉపాధ్యక్షుడు బొంగోని కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు.
అంతకుముందు కుమార్ గౌడ్ తో పాటు పలువురు స్థానిక ఆలయంలో అర్చన చేసి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్దికుంట సాయికుమార్, రాపల్లి విక్రమ్ ప్రసాద్, గుర్రం అజయ్, ఎనగందుల అనిల్ కుమార్, బొంగో ని అజయ్ కుమార్, బొంగోని సాయి శివ, గుర్రం వినయ్, గుర్రం వంశీ, ఏరుకొండ రాములుతో పాటు తదితరులున్నారు.