Chirumalla Rakesh Kumar | బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరుమల్ల రాకేష్ ఆధ్వర్యంలో కేటీఆర్ 50వ ముందస్తు జన్మదిన వేడుకలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ముందస్తు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
- ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ
Chirumalla Rakesh Kumar | పెద్దపల్లి, జూలై 23(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ముందస్తు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమిల్ల రాకేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాకేష్ కుమార్ మాట్లాడుతూ కేటీఆర్ ప్రజాసేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సమాజ సేవే కేటీఆర్ జన్మదిన వేడుకల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఢిల్లీలో నీట్ విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను నిరసిస్తూ శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకోసమే కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించమన్నారు. ఈ పోరాటానికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మొబిన్, మాజీ కౌన్సిలర్లు బిక్షపతి, స్వామి, ఉపసర్పంచ్ మేకల కుమార్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్ర దేవేందర్ రెడ్డి, పడాల సతీష్ గౌడ్, బింగి రాజు, మేడుదుల రాజ్ కుమార్, ఉప్పు శివ కుమార్, బోయిని మనోజ్, పెంచాల శ్రీకాంత్, కంచి నాగరాజ్, దాసరి సతీష్, ఇరుగురాల స్వామి దాస్, సాయి, వెంకటేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

