పాట్నా, సెప్టెంబర్ 9 : బీహార్లోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోని లంచగొండి ఉద్యోగులు, అధికారులు లంచాల స్వీకరణకు కొత్త కోడ్లను వాడుతున్నారు. ఫోన్లో, నేరుగా లంచం అడుగరు. దానికి బదులుగా ఏక్ బోరా చావల్ (ఒక బస్తా బియ్యం) , ఏక్ పేటీ (ఒక పెట్టె), తేల్ పానీ (నూనె, నీరు) లాంటి కోడ్ పదాలను వాడుతున్నారు.
ఒక దౌర్జన్యం కేసులో పోలీస్స్టేషన్ రికార్డుల్లో తన కుమారుడి పేరు తొలగించడానికి పోలీసులు ఏక్ బోరా చావల్ (రూ.లక్ష) డిమాండ్ చేశారని ఒక బాధితుడి తల్లి తెలిపింది. ఇటీవలే రెవెన్యూ, భూ సంస్కరణల శాఖ అధికారి కాంచన్ కుమారిని విజిలెన్స్ అరెస్ట్ చేసింది. రికార్డుల్లోని వివరాలను మార్చడానికి ఆమె ఒకరి నుంచి వాషింగ్ మెషీన్, రెండు లక్షల నగదును తన పనిమనిషి ద్వారా లంచంగా తీసుకున్నట్టు అధికారులు గుర్తించి.. ఆమెపై చర్యలు తీసుకున్నారు.