రాజన్న సిరిసిల్ల, జూలై 16 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నిర్వహించే సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి హాజరు కానున్నారు.
మండలాల వారీగా సమీక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో కార్యకర్తలకు దిశానిర్దశం చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.