KTR | సిరిసిల్ల రూరల్, జూన్ 15: ఆపద ఉందంటే తానెప్పుడూ ముందుండే మంచి మనసున్న కేటీఆర్ మహేష్ కు అండగా నిలిచి ఆపద్బాంధవుడిగా నిలిచిడు. మహేష్ కు కష్టం వచ్చిందని తెలిసిన వెంటనే స్పందించిన కేటీఆర్ దేశం వెలుపల ఉన్న మహేష్ కు అండగా నిలిచాడు. పొట్ట కూటి కోసం పరాయి దేశం వెళ్లిన మహేష్ కు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వ్యక్తికి చేయూతనందించాడు. అక్కడ అచేతన స్థితిలో పడి ఉండి దిక్కుతోచని స్థితిలో సెల్పీ విడియో ద్వారా తన గోడును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రామన్న నన్ను ఆదుకోండి అని వెల్లబోసుకున్న వెంటనే స్పందించాడు. ఆ యువకుడికి అండగా నిలవడమే కాకుండా, వారి కుటుంబసభ్యులను కలిసి, ధైర్యంగా ఉండు మహేష్.. నాలుగైదు రోజుల్లో తీసుకువస్తా అంటూ భరోసానిచ్చిన విధంగానే ఆపన్నహస్తం అందించాడు. స్వదేశానికి తీసుకురావడంతోపాటు కిమ్స్ దవాఖానాలో చేర్చించి, కేటీఆర్ తన సొంత ఖర్చులతో మెరుగైన వైద్యం చేయించి మహేష్ కుటుంబానికి భరోసా నింపాడు.
సౌదీలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన మంద మహేష్(32) బీఆర్ఎస్ కార్యకర్తకు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలయ్యాడు. మే నెలలో సౌదిలో మహేష్ వెళ్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. కాగా ఈ ప్రమాదంలో మహేష్ తో పాటు ఉన్న ఎనిమిది మంది అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. మహేష్ ప్రాణాలతో బయటపడి, అక్కడ 20 రోజులుగా సౌదీలోని దవాఖానాలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో నడుం, కాళ్లు విరిగి అచేతన స్థితిలో ఉన్న మహేష్ తన దయనీయ పరిస్థితిని వివరిస్తూ సెల్పీ విడియో తీసీ కేటీఆర్ ను పంపాడు. వైద్యానికి ఖర్చులతోపాటు నన్ను ఇక్కడ నుంచి స్వదేశానికి తీసుకెళ్లాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కేటీఆర్ ను వేడుకున్నాడు.
కేటీఆర్ తక్షణమే స్పందించి, మహేష్ వివరాలను ఇండియన్ ఎంబీసీ అధికారులతో మాట్లాడి, స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా మే నెలలో 11న మండెపల్లిలో మహేష్ కుటుంబసభ్యులను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. అక్కడి నుంచి మహేష్ విడియో కాల్ మాట్లాడి, మహేష్ నాలుగైదు రోజులు ధైర్యంగా ఉండూ..మండెపల్లీ నేను తీసుకోస్తా అని భరోసానిచ్చారు. సొంత ఖర్చులతోమాట్లాడే మహేష్ నాలుగైదు రోజులు ధైర్యంగా ఉండూ.. మండెపల్లీ నేను తీసుకోస్తా అని భరోసానిచ్చారు. సొంత ఖర్చులతో స్వదేశానికి తీసుకువచ్చి,ఇంటికి తీసుకొస్తా అంటూ అభయమిచ్చారు. మహేష్ కు చెప్పినట్లుగానే కేటీఆర్ చకచకా తన టీం సభ్యులతోపాటు ఇండియన్ ఎంబీసీ అధికారులతో మాట్లాడి మహేష్ ను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు పూర్తి చేశారు. మే 21న సౌదీ నుంచి హైదరబాద్ తీసుకురాగా, కేటీఆర్ ప్రత్యేక చొరవతో కిమ్స్ దవాఖాన యాజమాన్యం మహేష్‌కు మెరుగైన వైద్యం అందిస్తామని హమీనివ్వడంతో నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి కిమ్స్ దవాఖానలో కుటుంబసభ్యులు చేర్పించారు.
రూ. 9లక్షలతో మెరుగైన వైద్యం
కిమ్స్ దవాఖానాలో మహేష్‌కు మెరుగైన వైద్యం చేయించారు. దవాఖానాలో ఎడమకాలుకు శస్త్ర చికిత్స తోపాటు ఇతర ఖరీదైన క్రిటికల్ వైద్య సేవలను ప్రత్యేకంగా చేయించారు. సుమారు 20 రోజులుగా పైగా దవాఖానాలో ఉండగా, రెండు రోజుల క్రితం మహేష్ ను డిశ్చార్జీ చేసి పంపించారు. దవాఖానాలో రూ.9లక్షలవరకు కేటీఆర్ చెల్లించారు. మండెపల్లిలో తన ఇంటికి చేరిన మహేష్, కుటుంబసభ్యులు మంత్రికేటీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.
ఏడాది క్రితం దుబాయ్ వెళ్లిన మహేష్..
మండెపల్లి కి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మంద మహేష్ గత ఎంపీ ఎన్నికల్లో చురుగ్గా ప్రచారంలో పాల్గొన్నాడు. తర్వాత ఉపాధి కోసం సౌదీలో ఏసీ మెకానిక్ పనిమీద ఉపాధి కోసం వెళ్లాడు. మే నెలలో రోడ్డు ప్రమాదం జరిగింది. మహేష్ కు భార్య లక్ష్మితోపాటు నిత్యశ్రీ(9), కొడుకు హర్షవర్ధన్ (7) లు ఉన్నారు.