సిరిసిల్ల టౌన్/ గంభీరావుపేట/ ఎల్లారెడ్డిపేట మే 18: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పలు శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ.. వారికి శుభాకాంక్షలు చెబుతూ ముందుకు సాగారు. సిరిసిల్ల పట్టణంతోపాటు ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యారు. గంభీరావుపేట మండలం కోళ్లమద్దిలో మల్లికార్జునస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం పెద్దమ్మ ఆలయాన్ని సందర్శించారు. పలు వివాహ వేడుకల వద్ద యువతీ యువకులు కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. చిన్నారులతో కలిసి వచ్చిన దంపతులు సైతం కేటీఆర్‌ను కలిసి ఫొటో దిగేందుకు ప్రయత్నించగా పిల్లలను ఎత్తుకుని ఫొటో దిగి వారి ముచ్చట తీర్చారు.