KTR | రాజన్న సిరిసిల్ల, జూన్ 13(నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. చిక్కాల రామారావు కుమారుడు అశ్విన్ రావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం సిరిసిల్లలో ఫిష్ చైర్మన్ చిక్కాల రామారావు నివాసానికి వెళ్లి పరామర్శించారు.
మొదట అశ్విన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అశ్విన్ రావు మృతిపై వివరాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన వెంట జిల్లా మాజీ అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పార్టీ నేతలు తదితరులు ఉన్నారు.