KTR | పెద్దపల్లి కమాన్, జులై 12 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ రాకేష్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని నివాసంలో కేటీఆర్ ను శనివారం కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా రాకేష్ కుమార్ ను కేటీఆర్ ఆశీర్వదించారు.
పెద్దపల్లి లో రాకేష్ జన్మదిన వేడుకలు
జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ రాకేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్స్ పంచి పెట్టారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, నాయకులు పెద్ది వెంకటేష్, పస్తాం హనుమంతు, పెంచాల శ్రీధర్, పూదరి శేఖర్, మేకల కుమార్, కర్రె దేవేందర్ రెడ్డి, ఉప్పు శివ కుమార్, బోయిని మనోజ్ పాల్గొన్నారు.