ఛత్రపతి ఆశయాలు యువతకు ఆదర్శం
ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆశయాలు యువతకు ఆ దర్శమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం జడ్చర్లలోని వీర శివాజీ నగర్కాలనీలో వీరశివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
- శివాజీ వ్యక్తి కాదు.. ఓ శక్తి స్వరూపుడు
- మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆశయాలు యువతకు ఆ దర్శమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం జడ్చర్లలోని వీర శివాజీ నగర్కాలనీలో వీరశివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడారు. ఛత్రపతి శివాజీ దేశభక్తి, ధైర్యసాహసాలు, పరిపాలనా దక్షత యువతకు ఆదర్శమన్నారు. స్వరాజ్య స్థాపన కోసం ఆయన చేసిన త్యా గం, ధర్మరక్షణ కోసం చూపిన పరాక్రమం, ప్రజల పై చూపిన పరిపాలన నైపుణ్యం నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. శివాజీ మహారాజ్ ఆశయాలను అనుగుణంగా యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నం వడ్డించారు. అదే విధంగా గురువారం సాయంత్రం బాదేపల్లి పాతబజార్ హనుమాన్ దేవాలయం వద్ద ఉన్న శివాజీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్రలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా శివాజీ జయంతి సందర్భంగా పాతబజార్ ఆంజనేయస్వామి ఆలయం వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శివాజీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ పాతబజార్ వద్ద శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పిట్టల మురళి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

