Krishnashtami | తిమ్మాపూర్, ఆగస్టు16: తిమ్మాపూర్ మండలం వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామకృష్ణ కాలనీలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు, గోపికమ్మల వేషధారణలతో ముస్తాబై ఆనందంగా గడిపారు. ఉట్టి కొట్టి చిన్నారులు సంబరపడ్డారు. మహిళ లు పెద్ద సంఖ్యలో పాల్గొని కృష్ణుడికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం, మహిళా సంఘం సభ్యురాలు, నాయకులు పాల్గొన్నారు.