Peddapally | పెద్దపల్లి, అక్టోబర్ 13 : పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా కొట్టె సదానందం ఎన్నికయారు. అమర్ చంద్ కల్యాణ మండపం లో ఎన్నికలు నిర్వహించారు.
ఈ ఎన్నికలలో ఉపాధ్యక్షుడిగా జనార్దన్ రావు, ప్రధాన కార్యదర్శిగా కొట్టె సదానందం, కల్చరల్ కార్యదర్శిగా ఎడ్ల మహేందర్, కోశాధికారిగా వేణు, కార్యవర్గ సభ్యులుగా తిరుపతి, లింగా రావు, కృష్ణ మూర్తి, వీరేశ్వర్ రావు, రవీందర్, సదానందం ఎన్నికయారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు.