Giri Pradakshina Yatra | కోరుట్ల, జూలై 6: అరుణాచల గిరి ప్రదక్షణ బస్సు యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ కోరారు. డిపో కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షణ కోసం కోరుట్ల డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ కల్పించినట్లు తెలిపారు.
బస్సు ఈనెల 8న సాయంత్రం 4 గంటలకు కోరుట్ల నుంచి బయలుదేరి కరీంనగర్, హైదరాబాద్ మీదుగా 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ చేరుకుంటుందని తెలిపారు. దర్శనానంతరం అక్కడి నుండి బస్సు బయలుదేరి 10న ఉదయం అరుణాచలం చేరుకుంటుందని తెలిపారు. అక్కడ గిరిప్రదక్షిణ అనంతరం అదే రోజు రాత్రి బయలుదేరి 11న గద్వాల జోగులాంబ అమ్మవారి దర్శనం ఉంటుందని చెప్పారు. అక్కడి నుండి అదే రోజు సాయంత్రం కోరుట్లకు బస్సు చేరుకుంటుందన్నారు.
గిరి ప్రదక్షణ టూర్ ప్యాకేజీ ధర పెద్దలకు ఒక్కొక్కరికి రూ.5వేలు, పిల్లలకి రూ.3800 టికెట్ ధర నిర్ణయించినట్లు తెలిపారు. కోరుట్ల పట్టణ, పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వివరాలకు 7989235379, 9963961503, 9440485576 సెల్ నెంబర్లలో సంప్రదించాలన్నారు.