ఇబ్రహీంపట్నం (మారుతీనగర్), డిసెంబర్ 7 : అమలుకు సాధ్యం హామీల్చిన కాంగ్రెస్ మాయమాటలకు మరోసారి మోసపోవద్దని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. పల్లెల ప్రగతి కోసం నిస్వార్థంగా పనిచేసేదెవరో ఆలోచించి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మెట్పల్లి మండలం వేంపేట, ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్‌కొండాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అందులో భాగంగా ఆయాచోట్ల ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికలున్నాయని గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారని, కానీ, పట్టణాల్లో ఎన్నికలు లేవని మహిళలు ఇవ్వలేదన్నారు.
ఓట్ల కోసమే చీరలను అందించిన విషయాన్ని మహిళలు గ్రహించాలని కోరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలను ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు. ఫకీర్కొండాపూర్కు బ్రిడ్జిని కేసీఆర్ హయాంలో మంజూరు చేస్తే.. ఈ ప్రభుత్వం రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. అకాల వర్షాలు, వరదలొస్తే నిజాయితీగా పనిచేసి తాత్కాలిక మట్టిని వేయించిన బిచ్చుల సత్తయ్య కత్తెర గుర్తుకు ఓటేసి బారీ మెజార్జీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం మండలాధ్యక్షుడు ఎల్లాల దశరథ్‌రెడ్డి, నాయకులు జాజాల జగన్, నోముల లక్ష్మారెడ్డి, కంఠం రమేశ్, లక్పతిరెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.