MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, సెప్టెంబర్ 18: పట్టణంలో శనివారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్టినరోజు పురస్కరించుకొని స్థానిక సాయి రామ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే సంజయ్ ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. అలాగే పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, బాలింతలు, గర్భిణులకు పాలు, పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారీశెట్టి రాజేష్, నాయకులు అన్వర్, వనతడుపుల అంజయ్య, జాల వినోద్, చిత్తరి ఆనంద్, నత్తి రాజ్ కుమార్, పొట్ట సురేందర్, అనంత స్వామి, శ్రీపతి, నగేష్ తదితరులు పాల్గొన్నారు.